ప్రభుత్వ పాఠశాలకు బీరువా దానం
NEWS Sep 26,2024 12:58 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల అర్బన్ పెద్దూరు ఎంపిహెచ్ఎస్ పాఠశాలకు పట్టణంలోని రాధా మాధవ్ షాపింగ్ మాల్ అధిపతి రాజూరి వాసుదేవరాయలు 10వేల రూపాయల విలువైన బీరువాను బహుకరించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. పాఠశాలకు ఏ విధమైన అవసరాలు ఉన్నా తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.