సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
NEWS Sep 26,2024 01:01 pm
సిరిసిల్ల జిల్లా: సీఎం సహాయ నిధిలో భాగంగా సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ 9వార్డ్ బాబాజీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇనుకొండ రజిత సతీష్ కి 28,500 చెక్కు ను పట్టణ ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ అందించారు. వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా Scసెల్ కన్వీనర్ మంగ కిరణ్, పట్టణ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సలెంద్రి వేణుగోపాల్ పాల్గొన్నారు.