పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు
NEWS Sep 26,2024 01:19 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ లో వంతడుపుల సుధాకర్ ఇంటిలో అక్రమంగా పేకాట అడుతున్నారన్న సమాచారం మేరకు బుధవారం రాత్రి సుధాకర్ ఇంటిలో సోదా చేసి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోనికి తీసుకున్నారు. రూ. 38,200, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.