తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధి నిరూపించుకో జగన్: మంత్రి పయ్యావుల
NEWS Sep 25,2024 04:09 pm
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం వైయస్ జగన్ తీరుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కొండపై గతంలో జరిగిన తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగు చూశాయి. అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆయనపై విశ్వాసముందని రిజిస్టర్లో సంతకం చేయాలి. అలా చేసి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పయ్యావుల సూచించారు.