ఈనెల 27న తిరుమలకు మాజీ సీఎం జగన్
NEWS Sep 25,2024 03:46 pm
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో ఈనెల 27న వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ తిరుమల వెళ్తున్నారు. 28న (శనివారం) ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో తిరుమలకు సీఎం హోదాలో వెళ్లిన జగన్.. వెంకన్నపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. కల్తీ వివాదం నేపథ్యంలోనైనా డిక్లరేషన్ ఇస్తారా అన్నది చర్చనీయాంశమైంది.