ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
NEWS Sep 26,2024 01:20 pm
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి అష్టోత్తరాలతో పూజా కార్యక్రమాలను చేశారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. అనంతరం పడి వెలిగించారు. కోశాధికారికి సాగర్, సభ్యులు శేషగిరి, గోపాల్, ప్రసాద్ పాల్గొన్నారు.