లంబాడాల శ్రేయస్సు కోసం కృషి చేయాలి
NEWS Sep 26,2024 01:22 pm
భద్రాద్రి సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ మండల కేంద్రంలోని గిరిజన ఉద్యోగ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడాల శ్రేయస్సు కోసం కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శివ నాయక్, కేటీపీస్ ఉద్యోగ నాయకులు, టిటిఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సపావత్ బాలకృష్ణ చౌహన్, సేవాలాల్ సేన, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.