టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
NEWS Sep 25,2024 04:16 pm
గత సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు రూ.4,701 కోట్ల నుండి కార్మికులకు 33 శాతం వాటా రూ.1551 కోట్లు ఇవ్వాలని బుధవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం జీఎంకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి లాభాలా చరిత్రలో ఇది అత్యధికం కావడం విశేషం సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు.