హైదరాబాద్‌లోని నాలాలో మొసలి కలకలం
NEWS Sep 26,2024 01:25 pm
హైదరాబాద్ నగరంలోని నాలాలో మొసలి కలకలం రేపింది. పాతబస్తీ బహదూర్‌పుర నాలాలో మొసలి కనిపించింది. జనావాసాల పక్కనే నాలాలో మొసలి కనిపించడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాగా, గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. అందువల్ల నాలాలు ఉప్పొంగుతున్నాయి. వర్షాలు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.