అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్
NEWS Sep 26,2024 01:27 pm
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని రెవెన్యూ,మున్సిపల్ పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవోలతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు కుంటలు నిండి అలుగులు పారే అవకాశం ఉన్నందున నూతన ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డిఓలు, తహసిల్దారులు, మున్సిపల్ అధికారులు, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు జాగ్రత్త వహించాలన్నారు.