విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
NEWS Sep 26,2024 01:32 pm
మునిపల్లి లోని గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతిరోజు భోజనం ఎలా పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపాల్ సూచించారు.