గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల పరిష్కారానికి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్ పేర్కొన్నారు. పఠాన్ చెరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ మంచినీటి సహాయకులకు నిర్వహిస్తున్న 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. హ్యాండ్ పంప్స్, వాటర్ క్వాలిటీ, పైప్ లైన్ లీకేజీ, వాటర్ పంప్ సెట్స్ లపై శిక్షణ అందజేస్తున్నట్లు వివరించారు. ఈఈ షేక్ పాషా, డిఇలు శ్రీనివాస్, సుచరిత, ఎంపీడీవో యాదగిరి, ఎంపీఓ హరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.