పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించం
కార్పొరేషన్ చైర్మన్లతో సీఎం చంద్రబాబు భేటీ
NEWS Sep 25,2024 01:38 pm
కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన నాయకులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఫస్ట్ లిస్టులో కొందరికి పదవులు ఇచ్చాం. ఇంకా లిస్టులు ఉన్నాయి. నాయకులు తొందర పడుతున్నారు. పార్టీ కోసం జైలుకెళ్లారు. ఆస్తులు కోల్పోయారు. కేసులు ఎదుర్కొన్నారు. ఎవరు ఎలా పనిచేశారో పూర్తి సమాచారం ఉంది. కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించబోమని చంద్రబాబు అన్నారు.