ఐటీ డెస్టినేషన్‌గా విశాఖ
5 ఏళ్లలో 20వేల ఉద్యోగాలు: మంత్రి లోకేష్
NEWS Sep 25,2024 01:02 pm
రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయని.. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడేవిధంగా చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. యువతకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పన కోసం ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీతో చర్చించాం. విశాఖలోని ఐటీ కంపెనీలతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఓ పెద్ద ఐటీ కంపెనీ 1500 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వచ్చే ఐదేళ్లలో 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.