తిరుమల పవిత్రత, రక్షణకు 28న
పాపప్రక్షాళన పూజలు: వైఎస్ జగన్ పిలుపు
NEWS Sep 25,2024 12:48 pm
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. తిరుమలను, లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.