వచ్చేనెల కార్మికులకు లాభాల బోనస్ చెల్లింపు
NEWS Sep 26,2024 01:29 pm
తెలంగాణ సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ఆ సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సగటున ఒక్కొక్కరు సుమారు 1 లక్షా 90 వేల రూపాయల చొప్పున లాభాల వాటా బోనస్ ను పొందే అవకాశం వున్నట్లు సమాచారం.