మంచి ప్రభుత్వం కాదు..ముంచే ప్రభుత్వం..!
హామీల అమలుపై శ్వేతపత్రం ఇవ్వండి
NEWS Sep 25,2024 12:05 pm
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఆ పథకాలు అమలు చేయకపోతే మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? ముంచే ప్రభుత్వం అవుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పళ్ళెం, గరిటెలు కొడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ థాలి బజావ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు షర్మిల తెలిపారు.