మండల క్షేత్ర పర్యటనలో వ్యవసాయ అధికారులు
NEWS Sep 26,2024 01:12 pm
మండలంలోని క్షేత్ర పర్యటనలో భాగంగా వ్యవసాయ అధికారిని యోగిత పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పొలంలో ఆకు ఎండు తెగులు, బ్యాక్టీరియా, కాండం తొలిచుపురుగు లను గమనించారు వీటిని అరికట్టడానికి కచ్చితంగా కార్పస్ హైడ్రో క్లోరెడ్ 2 గ్రాము నీటిలో కలిపి పిచికారి చేయాలి, అలాగే పొలంలో నీటిని తీసివేసి ఆరబెట్టాలి, యూరియా పొలంలో చల్లకూడదు, అని తెలిపారు, అదేవిధంగా ఒకటి మూడు సంవత్సరాలకు పెరిగిన చెట్లలో ఆడ మగ పుష్పాలను తీసివేయాలని అప్పుడే పెరుగుతాయి అని అన్నారు.