తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబురాలు
NEWS Sep 25,2024 12:02 pm
తెలంగాణలో బొడ్డెమ్మల బతుకమ్మ సంబరాలు సోమవారం నుంచే మొదలయ్యాయి. బతుకమ్మ పండగంటే వాడ వాడంతా సందడిగా మారిపోతుంది. బతుకమ్మ పాటలతో, ఆటలతో హడావుడి వాతావరణం ఉంటుంది. 9 రోజులు బతుకమ్మ సంబరాలు ఏరోజు కారోజే ప్రత్యేకం అన్నట్టు సాగిపోతుంటాయి. ఒక్కోరోజు బతుకమ్మను ఒక్కోపేరు పెట్టి పిలుస్తారు. వివిధ వాయనాలు, ప్రసాదాలు సమర్పిస్తారు. మొదటి రోజు బతుకమ్మ పండగ పెత్ర అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య రోజున మొదలవుతుంది. ఆ రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు.