పండిత్ దీన్ దయల్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం
NEWS Sep 25,2024 11:42 am
పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ ఆశయ సాధన కోసం కృషి చేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భం సంగారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.