22వ వార్డ్ లో స్వచ్ఛత హీసేవ 2024-25 కార్యక్రమం
NEWS Sep 25,2024 11:36 am
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో స్వచ్ఛత హీసేవ 2024 - 25 కార్యక్రమంలో భాగంగా 22 వ వార్డులో రోడ్డుపై పారేసిన కొమ్మలను స్వచ్ఛంద సేవ సంస్థ యువకులు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అ వార్డు ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ఎక్కడైనా ఊరి బయట రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ ఆటోలకు అందివ్వాలని, స్వచ్ఛత సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కమిషనర్ తెలిపారు.