మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్
NEWS Sep 25,2024 12:00 pm
మూసీనది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ మురుగు శుద్ధి కేంద్రంలను ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్, కూకట్ పల్లి, మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.