మల్లాపూర్ ఎంఈఓ కేతిరి దామోదర్ రెడ్డి
NEWS Sep 25,2024 11:38 am
మల్లాపూర్ మండల విద్యాధికారిగా కేతిరి దామోదర్ రెడ్డి(రాఘవపేట-జడ్పీ హైస్కూల్ హెచ్ఎం)ని నియమిస్తూ విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మల్లాపూర్ మండల విద్య వనరుల కేంద్రంలో బుధవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.