ఘనంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
NEWS Sep 25,2024 10:40 am
ఆర్థికవేత్త, తత్వవేత్త, పాత్రికేయులు దీనదయాళ్ ఉపాధ్యాయుడు 108 వ జయంతి సందర్భంగా అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బేబీరాణి, మల్లాది మాల్లిబాబు,యనమదల వెంకటరమణ, మిద్దె రవి, మల్లాది సూర్యప్రకాశరావు, రాధాకృష్ణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.