అందుకే ఒకేసారి 50వేల చెట్లు కూలాయి..
NEWS Sep 25,2024 08:25 am
మేడారం అడవుల్లో భారీ ఎత్తున చెట్లు నేల కూలడంపై శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండం వల్ల గంటకు 140 కిలో మీటర్ల వేగంతో గాలి వీచాయని, సారవంతమైన భూమిలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల ఈ చెట్ల వేళ్లు భూమిలోకి నిటారుగా కాకుండా అడ్డంగా వెళ్లడం కూడా చెట్లు త్వరగా నేలకొరగడానికి కారణం కావచ్చని అంటున్నారు.