మంచినీటి సహాయకులకు 4 రోజుల శిక్షణ
NEWS Sep 25,2024 09:40 am
జగిత్యాల మండల సమావేశ మందిరంలో గ్రామ మంచి నీటి సహాయకుల నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల నుండి ఒక్కొక్క గ్రామ మంచి నీటి సహాయకులను గుర్తించారు. వారికి 4 రోజుల నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అదనపు కలెక్టర్ గౌతం రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా 4 అంశాలు 1. హ్యాండ్ పంప్ రిపేర్, 2. ఎలక్ట్రికల్, 3. ప్లంబింగ్, 4.వాటర్ క్వాలిటీ అవగాహన వంటి అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.