24 గంటల తర్వాత అంత్యక్రియలు
NEWS Sep 25,2024 09:49 am
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ యువకుడి అంత్యక్రియల వివాదం సద్దుమణిగింది. గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాస్ ఈ నెల 6న గడ్డి మందుతాగి అత్మహత్యయత్నం చేశాడు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ప్రభాస్ మృతికి తన తల్లీ అనంత కారణమని గ్రామంలోని మహిళలు నిన్న దాడి చేశారు. తీవ్రగాయాలైన అనంతను అసుపత్రికి తరలించారు. అనంతపై ఉన్న ఆస్తి, భూమి అన్నీ మార్పిడి చేసెంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ రోజు పలువురి హామీతో ప్రభాస్ అంత్యక్రియలు నిర్వహించారు.