పరిసరాలను శుభ్రపరిచిన యువకులు
NEWS Sep 25,2024 09:50 am
స్వచ్ఛతా హీ సేవా 2024లో భాగంగా మున్సిపల్ కమీషనర్ తిరుపతి ఆధ్వర్యంలో పట్టణంలోని అయిలాపూర్ రోడ్డుకు చెందిన సుమారు 80 మంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మున్సిపల్ కమీషనర్తో కలిసి పలు ప్రదేశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమీషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పట్టణంలోని యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛత సేవాహీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం, విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.