కారు బోల్తా.. తప్పిన ప్రమాదం
ఉపాధ్యాయులకు గాయాలు
NEWS Sep 25,2024 09:55 am
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాసాన్పల్లి వద్ద పాఠశాలల విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు మాసాన్ పల్లి ప్రధాన రహదారిపై బోల్తా పడింది.నేరేడిగుంట, అక్సాన్ పల్లి తదితర గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్న క్రమంలో 161వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి బోల్తాపడగా ఏడుగురు ఉపాధ్యాయులకు గాయాలు అయ్యాయి.ఇద్దిరికి తీవ్రం గాయలు కాగా, ఐదగురు ఉపాధ్యాయులకు స్వల్పంగా గాయాలయ్యాయి.జోగిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.