ఏపీలో 3,736 మద్యం షాపులకు నోటిఫికేషన్
అక్టోబర్ నుంచి అమల్లోకి కొత్త విధానం
NEWS Sep 25,2024 02:45 am
రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో షాపులను ప్రభుత్వమే నడిపేలా చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలపగానే.. మొత్తం 3,736 మద్యం షాపులకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.