సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన మహిళ
NEWS Sep 25,2024 09:59 am
జగిత్యాల: అధిక ఆదాయానికి ఆశపడిన ఓ మహిళ సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాలకు చెందిన ఓ మహిళకు ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె నమ్మి పలు దఫాలుగా రూ. 1.78 లక్షల పెట్టుబడి పెట్టింది. తర్వాత నిర్వాహకులు యాప్ ను మూసివేయడంతో మోసపోయారని గ్రహించి పోలీసుల ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.