అక్టోబర్ 4న తిరుమలకు సీఎం చంద్రబాబు
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పణ
NEWS Sep 25,2024 02:08 am
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరుఫున స్వామివారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యుల నియామకాలను సీఎం పూర్తి చేస్తారని, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక వచ్చాక నిందితులు ఎంతటి వారైనా చర్యలు ఉంటాయని మంత్రి ఆనం వెల్లడించారు.