నేడు వరద బాధితులకు పరిహారం
ఖాతాల్లో జమ చేయనున్న సీఎం చంద్రబాబు
NEWS Sep 25,2024 01:54 am
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం నేడు పరిహారాన్ని విడుదల చేయనుంది. ఎన్జీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు డీబీటీ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. బుడమేరు ఉద్ధృతి కారణంగా వేల ఇళ్లు, షాపులు, వాహనాలు, పంటలు నీళ్లలో ఉండి పాడైన బాధితులకు పరిహారం అందిస్తారు.