BRS కార్యకర్తలే పార్టీకి బలం బలగం
NEWS Sep 24,2024 05:47 pm
కార్యకర్తలు పార్టీకి బలం.. బలగమని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మంగళవారం మేడిపల్లి మండలంలో వనభోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కార్యకర్తల పాత్ర ఎంతో విలువైనదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బిఆర్ఎస్ పార్టీ బలాన్ని బలగాన్ని అందివ్వాలని అన్నారు. ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు విఫలమైందని అన్నారు.