మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
NEWS Sep 24,2024 05:49 pm
సిరిసిల్ల జిల్లా: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని, 25 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మికంగా ఉన్న పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి పిఆర్సి బకాయిలను అందించాలని పలు డిమాండ్లతో మున్సిపల్ వర్కర్స్ , ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య, రాజయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.