కేసుల పరిష్కారానికి సహకరించాలి
NEWS Sep 24,2024 05:39 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారిని అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.సంజీవ్ రెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రటరీ టీ.వెంకట్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.