రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులకు అవగాహన సదస్సు
NEWS Sep 24,2024 05:00 pm
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్ విష్ణు, ట్రాఫిక్ సిఐలు రమేష్ రామారావు పాల్గొని రహదారి భద్రత, పౌరుల బాధ్యత గురించి విద్యార్థులకు వివరించారు.