తిరుపతికి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..
తిరిగి హైదరాబాద్ లో ల్యాండింగ్
NEWS Sep 24,2024 05:37 pm
హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో విమానం తిరిగి హైదరాబాద్ లోనే ల్యాండింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 6.35కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ఉ.7.30కి తిరుపతిలో దిగాల్సి ఉంది. కానీ ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు యూ టర్న్ తీసుకుని మళ్లీ ఉ.8.30 గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అయిందని పేర్కొన్నారు.