పప్పు కర్రీలో జెర్రి.. కంగుతిన్న కస్టమర్
NEWS Sep 24,2024 05:05 pm
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ లో తాజ్ మహల్ హోటల్ లో భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్ కు వింత అనుభవం ఎదురైంది. సదరు కస్టమర్ పప్పు కర్రీ ఆర్డర్ చేయగా అందులో జెర్రి ప్రత్యక్ష్యమైంది. దీంతో కంగుతిన్న కస్టమర్.. హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు. అయితే నిర్వాహకుల నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..