జిన్నారంలో 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం
NEWS Sep 24,2024 04:52 pm
జిన్నారం మండలంలో అత్యధికంగా మంగళవారం 4.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత ఝరాసంఘంలో 4.3, పటాన్ చెరు 3.8, మునిపల్లి 3.2, సదాశివపేట 2.9, గుమ్మడిదల, హత్నూర 2.6, అమీన్ పూర్ 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 6 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.