28న జాతీయ లోక్ అదాలత్: జడ్జి
NEWS Sep 24,2024 04:51 pm
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కాంపౌండబుల్, వాహన నష్టపరిహారం, చిట్ ఫండ్, ఆస్తి తగాదాలు, బ్యాంకు రికవరీ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కేసులు రాజీ చేసుకొని సత్వర న్యాయం పొందాలని సూచించారు.