20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
సామాజిక సమతూకం పాటించిన చంద్రబాబు
NEWS Sep 24,2024 02:20 pm
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలైంది. తొలివిడతగా 20 కార్పోరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంపికలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూనే.. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు.