మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం
NEWS Sep 24,2024 04:38 pm
పటాన్ చెరు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీ, జల్సా కార్యక్రమాల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ రెడ్డి, ఎస్సై, పోలీసు సిబ్బందిని మిలాద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మిలాద్ ఉన్ నబి పండుగ నిర్వహణకు పోలీసుల సహకారం మరువలేనిదని అన్నారు. పోలీస్ శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా పట్టణ మైనార్టీ ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు.