జిల్లాకు 10 మంది ట్రైనీ ఎస్సైలు: ఎస్పి
NEWS Sep 24,2024 03:12 pm
జిల్లాకు పదిమంది ట్రైనీ ఎస్ఐలను కేటాయించినట్లు ఎస్పీ రూపేస్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వారితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. సమాజ సేవ చేసినందుకు పోలీస్ శాఖ మరింత ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.