ఆర్టీజీఎస్ ద్వారా సత్వరమే పౌరసేవలు
అందించేలా ప్రణాళిక: సీఎం చంద్రబాబు
NEWS Sep 24,2024 01:20 pm
రాబోయే 100 రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అందించనున్న పౌరసేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక రిపోర్టు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ప్రజల మాస్టర్ డేటాను అన్ని శాఖల నుంచి తీసుకుని సేవలు మరింత వేగంగా అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.