ఓటర్ జాబితా ప్రక్రియ కట్టుదిట్టంగా: కలెక్టర్
NEWS Sep 24,2024 03:00 pm
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటింటి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలిపేలా ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని బిఎల్ఓ లకు సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.