కల్తీ నెయ్యి వివాదంపై విచారణ షురూ..
సిట్ చీఫ్‌గా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
NEWS Sep 24,2024 01:01 pm
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉంటారు.