డాక్టర్ గుండ జనార్ధన్ సేవలు మరువలేనివి
NEWS Sep 24,2024 03:01 pm
డాక్టర్ గుండ జనార్ధన్ 4వ వర్ధంతి సందర్భంగా జోగిపేట పట్టణంలోని శ్రీ రాఘవ ఆసుపత్రిలో ఆయన కుమారుడు డాక్టర్ జగదీశ్వర్ గుండ జనార్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వర్ధంతి సందర్భముగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ డాకూరు వెంకటేశం, మున్సిపల్ కౌన్సిలర్లు నాని, చందర్ నాయక్ మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్, తుపాకుల సునీల్, నాయకులు చిట్యాల మధు, గుర్రపు కృష్ణ,అనిల్, మురళి,గుండ శ్రీనివాస్ నివాళులర్పించారు.