నైజంకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే
NEWS Sep 24,2024 03:03 pm
జోగిపేటలో ప్రజానాట్యమండలి శౌర్య యాత్రలో భాగంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాటిక ప్రదర్శన తొలి ఆంధ్ర మహాసభ జరిగిన జోగిపేట క్లాక్ టవర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విరోచితంగా పోరాడింది కమ్యూనిస్టులే అని చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య లాంటి మహానుభావులు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించారన్నారు. అనేకమంది పేదలకు భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు.