తిరుపతి లడ్డు ప్రపంచంలోనే ఒక చరిత్ర
*-హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పది*
NEWS Sep 24,2024 03:15 pm
తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదంటే అతిశయోక్తి కాదు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం పత్రికా ముఖంగా మాట్లాడుతూ.. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం అన్నారు. కోట్లాది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డును నలుగురికి పంచి తాము స్వీకరించే భక్తుల నమ్మకాన్ని నేడు కొల్లగొట్టారన్నారు.